దాస్ కోసం జ్యోత్స్న వెతుకులాట.. కన్నవారింటికి జ్యోత్స్న!
on Jun 1, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -372 లో...కార్తీక్ తో పాటు దీప కూడా శివన్నారాయణ ఇంట్లో పని చెయ్యడానికి సిద్ధం అవుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టం లేకున్నా ఒప్పుకున్నారు. కార్తీక్, దీప బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. నువ్వు పని చెయ్యడం ఏంటని కార్తీక్ అడుగుతాడు. నా వాళ్లకి నేను చేస్తున్నానని దీప అంటుంది. ఇద్దరం కలిసి రెండు కుటుంబాలని కలపాలి. ఇదొక యాగం.. దీన్ని ఇద్దరం చేసి రెండు కుటుంబాలని కలపాలని దీపతో కార్తీక్ అంటాడు. ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అప్పుడే పారిజాతం వచ్చి.. పనివాళ్ళు ఎంత సేపు మాట్లాడుకుంటారు. దీప నువ్వు వెళ్లి యజమానికి జ్యూస్ ఇవ్వు అని అనగానే దీప లోపలికి వెళ్తుంది.
ఆ తర్వాత దీప ఇంట్లో ఉందని సుమిత్ర చిరాకుగా ఉంటుంది. అప్పుడే దీప జ్యూస్ తీసుకొని వస్తుంది. దాంతో దీపని సుమిత్ర తిడుతుంది. అమ్మనాన్నలు లేని దానికి విలువ ఎలా తెలుస్తుందని పారిజాతం అనగానే.. నాకూ అమ్మ నాన్న ఉన్నారు. ఇక్కడే ఉన్నారు అని దీప అనగానే ఏంటి దీపకి నిజం తెలిసిందా ఏంటని జ్యోత్స్న కంగారు పడుతుంది. ఇంకా నయం మా సుమిత్ర, దశరథ్ లు అంటలేవని పారిజాతం అనగానే.. మీరు ఇంకొకసారి అలా పొరపాటున కూడ అనకండి అని పారిజాతంతో సుమిత్ర అంటుంది. సుమిత్ర కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. సుమిత్ర కోసం తీసుకొని వచ్చిన జ్యూస్ పారిజాతం తాగుతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత పారిజాతాన్ని తీసుకొని దాస్ ఇంటికి వస్తుంది జ్యోత్స్న. అక్కడ స్వప్నతో పారిజాతం గొడవ పెట్టుకుంటుంది. దాస్ ఎక్కడ అని పారిజాతం అడుగగా.. ఇంట్లో నుండి వెళ్తున్నా.. నాకోసం ఎవరు వెతకొద్దు.. నేనే వస్తానని పేపర్ పై దాస్ రాసింది తీసుకొని వచ్చి జ్యోత్స్నకి ఇస్తాడు కాశీ. నాన్న ఎక్కడికి వెళ్ళడని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నాన్న అంటున్నావని కాశీ అంటుంటే పారిజాతం డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి జ్యోత్స్న, పారిజాతం వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
